Telangana | తెలంగాణలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కంపెనీ అయిన ‘ఫాక్స్ కాన్'(Foxconn) భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ(Young Liu) ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్(CM KCR) తో సమావేశమై ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ ఏర్పాటుచేసి.. లక్షమంది యువతకు ఉపాధి కల్పించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో ఫాక్స్ కాన్ చైర్మన్ తో భేటీ అయిన కేటీఆర్(KTR).. తెలంగాణ(Telangana)కు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను వివరించారు. కేటీఆర్ ఆహ్వానంతో చైర్మన్ యంగ్ ల్యూ తన బృందంతో హైదరాబాద్ విచ్చేశారు.
Read Also: గవర్నర్ తమిళిసైపై సుప్రీంను ఆశ్రయించిన
Follow us on: Youtube