ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ఏపీ, తెలంగాణలో విస్తృతంగా గాలిస్తున్నాయి. పిన్నెల్లి కారు, మొబైల్ వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మొత్తం పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోనే ఏపీ పోలీస్ బృందాలు మకాం వేశాయి. ఇప్పటికే పిన్నెల్లి డ్రైవర్, మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలు మోహరించాయి.


