నాగర్ కర్నూల్ జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబం లో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ, ఇద్దరు కుమార్తెలు పప్పి, వసంత కుమారుడు విక్కీగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు లాగే రాత్రి భోజనం చేసి అందరూ నిద్రించారు. రాత్రి కురిసిన వర్షానికి అర్థరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్ల తో పాటు కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్ కర్నూల్ల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు గ్రామస్తులు. మృతదేహాలను ఆస్పత్రి మార్చూ రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.