ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి.. చెంచల్ గూడ జైల్లో ఉన్న మాజీ టాస్క్ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావును రెండురోజుల కస్టడికి నాంపల్లికోర్టు అనుమతించింది. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై జూబ్లీహిల్స్ పిఎస్ లో మరో కేసు అయింది. యజమానిని కిడ్నాప్ చేసి క్రియా హెల్త్ కేర్ సంస్థలో కోట్ల విలువైన షేర్లను.. నలుగురు డైరెక్టర్ల మీదకు బలవంతంగా బదిలీ చేయించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో రాధాకిషన్ రావుతో పాటు మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు సహా చంద్రశేఖర్ , కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం జూబ్లీహిల్స్ పోలీసులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు.