ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్లిపోయినా బీఆర్‌ఎస్‌కు పోయేదేమీ లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ హయాంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారని గుర్తు చేశారు. అప్పుడు కూడా బీఆర్‌ఎస్ పని అయిపోయిందని అన్నారని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్‌కు ఏమీ కాలేదని, ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్‌ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టామన్నా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డే ఇప్పుడు వివక్ష ఎమ్మెల్యేలను లాక్కుంటున్నారని అన్నారు.