వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతో సాధ్యమని ఆ పార్టీలో చేరానని అన్నారు. అయితే జరిగిన ఎన్నికల్లో వైసీపీని ప్రజలు తిరస్కరిం చారని చెప్పారు. సంక్షేమం, సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కూటమికి చరిత్రాత్మక విజయం సాధించి పెట్టారని తెలిపారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవ చేయడానికి అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రొత్సహించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో సాంఘిక, గిరిజన శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి పేద ప్రజలకు సేవ చేసానని గుర్తు చేశారు.


