తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖరాశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ.. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని.. కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తుందని లేఖలో తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని.. కాంగ్రెస్ నేతలే సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు తీసుకుంటున్నారని.. ఇది ఎమ్మెల్యే హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాయడమేనని కేటీఆర్ అన్నారు. స్పీకర్ ఈ విషయంలో చొరవ తీసుకుని.. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని.. ఈ విషయంలో సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని.. స్పీకర్ రాసిన లేఖలో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.


