స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు చెప్పండి. అభిమానులే కాదు ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా ధోనీ అంటే ఎంతో అభిమానిస్తారు. అతని వ్యవహారశైలితో పాటు నాయకుడిగా జట్టును నడిపించే తీరు ఎందరినో మహేంద్రుడికి అభిమానులను చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి చెపాక్ స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
ఈ మ్యాచులో వ్యాఖ్యాతగా వ్యవహిరస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ధోనీ దగ్గరకు వెళ్లి ఆటోగ్రాఫ్ అడిగాడు. దీంతో ధోనీ నవ్వుతూ గవాస్కర్ షర్ట్‌పై సంతకం చేశాడు. అనంతరం ఇరువురు ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి అయిన MSD ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఆనందంగా ఉందని గవాస్కర్ వెల్లడించాడు. కోల్‌కతా ఆటగాడు రింకూ సింగ్ కూడా ధోనీ సంతకం తీసుకున్నాడు. గవాస్కర్ షర్ట్‌ఫై ధోనీ ఆటోగ్రాఫ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.