19.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

ఏపీలో చంద్రబాబు రాక్షస పాలన పై మాజీ సీఎం జగన్ ధర్నా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి సర్కార్ భారీ మెజార్టీతో గెలిచింది. వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అయితే ఎన్నికల్లో గెలుపోటములు మన చేతుల్లో ఉండవు. అంతిమ నిర్ణయం ప్రజలదే. ఈ విషయాన్ని వైసీపీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిచ్చింది. అయితే కూటమి నేతల్లో .. గెలిచామన్న అహంకారంతో కావొచ్చు.. మన ప్రభుత్వమే అధికారంలో ఉందికదాని.. ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీపై దాడులు చేయడం ప్రారంభించారు. తమకు అడ్డూ అదుపు లేదన్నట్లుగా.. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కేవలం 45 రోజుల్లోనే 35 మంది వైసీపీ కార్యకర్తలను హత్య చేశారంటే.. దమన కాండ ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతల దాడులపై.. సాక్షాత్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించ లేదు.

కూటమి అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు భయం గుప్పిట్లో బతకాల్సి వచ్చింది. తాజాగా వినుకొండలో రషీద్ అనే వైసీపీ నేతలు దారుణంగా హత్య చేశారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన మాజీ సీఎం వైఎస్ జగన్ బాధిత కుటుంబాని పరామర్శించారు. వెంటనే గవర్నర్ ను కలిసి .. కూటమి దాడులపై వినతిపత్రం అందించారు. వైసీపీ కార్యకర్తలపై.. టీడీపీ దాడులను అరికట్టాలని గవర్నర్ కు జగన్ తన ఫిర్యాదులో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని జగన్ పిలుపునిచ్చారు. తమ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదంటూ ప్రత్యర్థులను హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు.. కూటమి దారుణ దాడులను.. కేంద్రం, రాష్ట్రపతి దృష్టికి తెలియజేయాలని జగన్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా జూలై 24న ఢిల్లీలో ధర్నాకు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తన మద్దతుదారులతో మాజీ సీఎం వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఫోటో ఎగ్జిబిషన్, వీడియోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. వైసీపీ చేపట్టిన ధర్నాకు యూపీ ఎస్పీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, టీఎంసీ ఎంపీలు, ఉద్దవ్ శివసేన, అన్నాడీఎంకే, జేఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎంపీలు మద్దతు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాలో జగన్ మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైనే .. కూటమి నేతలు దాడి చేశారని తెలిపారు. మాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారని జగన్ అన్నారు. ఏపీలో లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని.. లోకేష్‌ రెడ్‌ బుక్‌ హోర్డింగ్స్‌ పెట్టారని.. పోలీసులు కూడా రెడ్‌ బుక్‌ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారని జగన్ తన ఆవేదన వెలిబుచ్చారు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారన్నారు. వైసీపీకి చెందిన వందల ఇళ్లపై దాడులు చేసి, పంటలను ధ్వంసం చేసి.. తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు అంటూ జగన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో .. ఢిల్లీలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని జగన్ తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. వైసీపీ సానుభూతిపరుల వందల ఇళ్లను ధ్వంసం చేశారని జగన్ అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల్ని ధ్వంసం చేశారని.. వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారని.. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో దాడులపై కేంద్రం, రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో రాష్ట్రపతిపాలన ఒక్కటే శరణ్యమని జగన్ అన్నారు.

ఢిల్లీలో వైసీపీ ధర్నాకు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిపై దాడులు చేస్తున్నారని అఖిలేష్ యాదవ్ అన్నారు. వైసీపీపై జరిగిన దాడులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, రేపు జగన్ ముఖ్యమంత్రి కావచ్చని అఖిలేష్ అన్నారు. బుల్డోజర్ రాజకీయాలకు సమాజ్ వాదీ పార్టీ వ్యతిరేకమని.. భయపట్టే వారు అధికారం కోల్పోతారని అఖిలేష్ అన్నారు. జగన్ పార్టీ కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ప్రజలు హింసను సహించరన్నారు. ఇతరుల ప్రాణాల్ని తీయాల్సిన అవసరం లేదని అఖిలేష్ అన్నారు. ఎప్పుడైనా రాజకీయ కక్షలు అవసరం లేదని.. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదని అఖిలేష్ యాదవ్ అన్నారు

వైసీపీ ధర్నాలో అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై మద్దతు ప్రకటించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు.. కేంద్రం జోక్యం చేసుకోవాలని తంబిదురై కోరారు. ఏపీ మణిపూర్ లా మారుతోందని..ఉద్దవ్ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. ఎవరికైనా అధికారం వస్తుంది.. పోతుందని.. అయితే ప్రతికార దాడులు దుర్మార్గమన్నారు. కూటమి నేతల దాడులు చూస్తే బాధ కలుగుతుందని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని సావంత్ అన్నారు. వైసీపీ ధర్నాకు మరో ఉద్దవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది మద్దతు తెలిపారు. ఏపీలో చట్టబద్దమైన పాలన జరగడం లేదన్నారు. చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఏపీకి కేంద్ర హోంశాఖ స్పెషల్ టీమ్ ను పంపి.. దాడులపై స్వతంత్రంగా దర్యాప్తు చేయాలని సంజయ్ రౌత్ అన్నారు.

వైఎస్ జగన్ ను కలిసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ మద్దతు ప్రకటించారు. కూటమి నేతల దాడుల వీడియోలు చేస్తూ షాక్ తగిలినట్లుగా ఉందని టీఎంసీఎంపీ నదీముల్ హక్ తెలిపారు. దాడలను ఖండిస్తున్నానని.. సుమోటాగా కేంద్రం తీసుకుని చర్యలు చేపట్టాలని హక్ డిమాండ్ చేశారు. మొత్తానికి పార్లమెంట్ సమావేశాల వేళ.. కూటమి అరాచకాలపై వైసీపీ అధినేత, మాజీసీఎం జగన్ చేపట్టిన ధర్నా.. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.

Latest Articles

లండన్‌ పర్యటనకు వైఎస్‌ జగన్‌

వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌ పర్యటనకు వెళ్లారు. తన రెండో కుమార్తె వర్షారెడ్డి కాన్వకేషన్‌ సందర్భంగా జగన్‌ దంపతులు హాజరుకానున్నారు. జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్