34.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

తొలిసారి అంతరిక్షంలోకి తెలుగు తేజం

తెలుగు తేజం గోపిచంద్‌ తోటకూర అంతరిక్షంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించనున్నాడు. ఏపీకి చెందిన గోపిచంద్‌ ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నాడు గోపిచంద్‌. దీంతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డ్‌లోకి ఎక్కబోతున్నాడు.

విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర అమెరికాలో నివాసముంటున్నారు. ఈయన అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. ఎన్‌ఎస్‌-25 మిషన్‌ పేరుతో చేపట్టనున్న అంత రిక్ష యాత్రకు ఆరుగురిని ఎంపిక చేసినట్టు బ్లూ ఆరిజిన్‌ సంస్థ ప్రకటించింది. ఇందులో గోపీచంద్‌ తోటకూర కూడా ప్రకటించింది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్‌. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్‌ మిషన్‌ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. విజయవాడలో జన్మించిన గోపీచంద్‌ తోటకూర అమెరికాలో ఆరోనాటి కల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన కమర్షియల్‌ జెట్‌ పైలట్‌గా పని చేశారు. బుష్‌ ప్లేన్లు, ఏరోబాటిక్‌ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్‌ ఎయిర్‌ బెలూన్లకు కూడా పైలట్‌గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్‌ లైఫ్‌ కార్ప్‌ అనే ఒక వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపీచంద్‌ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. అయితే… భారతీయ మూలాలు ఉన్న పలువురు ఇంతకుముందు అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ వారంతా అమెరికాల పౌరులే. గోపిచంద్‌ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్