ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రెండ్స్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసింది. 26 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఉదయం 10 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజలో ఉంది. 28 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రస్తుతానికి ఒక్క స్థానంలో కూడా లీడ్‌లో లేదు. కాంగ్రెస్ అన్ని నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితమైంది.
రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యాలు మారుతున్నాయి. కేవలం కొన్ని నియోకవర్గాల్లో మాత్రమే వేలల్లో ఆధిక్యంలో ఉంది. కొన్ని స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య టగాఫ్ వార్ నడుస్తోంది. 6 నియోజకవర్గాల్లో ఆప్ , బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్లు చీలినట్టుగా సమాచారం. బీజేపీకి 47.66 శాతం ఓటింగ్ వస్తే.. ఆప్ 43 శాతం, కాంగ్రెస్ 6.8 శాతం ఉంది. కల్కాజీలో ఇంకా అతిశీ వెనుకంజలోనే ఉన్నారు.
బ్యాలెట్ లెక్కింపుల్లో వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్, సిసోడియా ముందంజలోకి వచ్చారు. న్యూ ఢిల్లీలో 343 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్ ఉన్నారు. జంగ్‌పూరాలో 1800ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోడియా ఉన్నారు.