ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఆరుగురు ఇంటర్ విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధిత విద్యార్థులను కాలేజి యాజమాన్యం వెంటనే ఆస్పత్రికి తరలించింది. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు కాలేజీ నిర్వాహకులు వైద్యం అందిస్తున్నారు. బుధవారం ఇంటర్ పరీక్షలు ఉండగా ఫుడ్ పాయిజన్ జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా.. మీడియాను చూడగానే.. బయటి ఫుడ్ తినడం వల్లే పాయిజన్ అయిందని విద్యార్థులతో చెప్పించే ప్రయత్నం చేసింది కాలేజి యాజమాన్యం.