స్వతంత్ర వెబ్ డెస్క్: వాల్తేరు వీరయ్య (Waltheru Veeraiah) 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఏపీ ప్రభుత్వానికి (AP Govt.) చురకలు అంటించారు. సినిమాలపై పడకుండా అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం.. వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?” అని చిరంజీవి వ్యాఖ్యానించారు.
సాధారణంగా చిరంజీవి సినిమా ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఇతర విషయాల గురించి మాట్లాడరు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చిరంజీవి (Chiranjeevi) వ్యాఖ్యానించడం చర్చనీయమైంది. చిరంజీవి ఎప్పుడూ కూడా వినయంగానే మాట్లాడతారు. ఎవరికైనా వార్నింగ్ ఇవ్వాలన్నా కూడా నవ్వుతూనే తనదైన శైలిలో చురకలు అంటిస్తారు. ఇప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం పై అలాగే ఎంతో పద్ధతిగా కౌంటర్లు వేశారు. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ (Reactions) వస్తాయో చూడాలి.