స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ తేదీలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ స్వాతంత్ర్య దినోత్సవంకి కొద్ది రోజుల ముందు.. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆగస్ట్ 4న ప్రారంభమై ఆగస్టు 9 వరకు మొత్తం 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటికే దీనిపై టీజర్‌ను రివీల్ చేసింది. విక్రయానికి రానున్న కొన్ని ఫోన్‌ల లిస్టును కూడా వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2023 ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై.. ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీగా డిస్కౌంట్లు ఉండనున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 11 డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఈ ప్లాట్‌ఫారమ్ కొన్ని ప్రసిద్ధ 5G ఫోన్‌లపై భారీ తగ్గింపును అందించనుంది. ఐఫోన్‌లతో పాటు, Samsung Galaxy S22+ కూడా సరసమైన ధరలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా, Pixel 6a, Samsung Galaxy Z Flip 3 మరిన్ని వంటి ఇతర ఫోన్‌లు కూడా రాయితీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ 5G ఫోన్‌ల యొక్క ఖచ్చితమైన డీల్ ధర రాబోయే రోజుల్లో లేదా ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈవెంట్‌కు ముందు వెల్లడించనున్నారు. ఈ సేల్‌లో కొన్ని వస్తువులపై ఏకంగా 70 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, దుస్తులు, ఫర్నిచర్‌లపై 80 శాతం డిస్కౌంట్ ఉండనుంది. టీవీ, ఏసీలు, ఫ్రిడ్జ్‌లపై 75 శాతం.. బ్యూటీ, ఫుడ్, టాయ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్లు ఉండే అవకాశం ఉంది. వీటిపై ఎంత డిస్కౌంట్ ఉంటుందనే వివరాలు సేల్ ఆరంభం అయ్యాక మాత్రమే తెలుస్తుంది.


