27.7 C
Hyderabad
Monday, June 24, 2024
spot_img

గుజరాత్ లో బీజేపీ విజయానికి 5 కారణాలు

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ప్రధాని మోదీ తీసుకున్న ఎన్నో విప్లవాత్మకమైన రాజకీయ మార్పులు ఆ పార్టీ భారీ గెలుపునకు నాంది పలికాయి. ముఖ్యంగా పటేళ్లను తమ వైపునకు తిప్పుకున్న మోదీ, ప్రజల్లో అసంతృప్తి ఉన్న 60 మంది సిట్టింగులకు సీట్లు నిరాకరించారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి పంచ కారణాలు బీజేపీ ఘన విజయానికి కారణమయ్యాయి. అవేమిటో చూద్దామా…

1. పటేళ్లను దగ్గర చేర్చుకుని… ముఖ్యమంత్రి పదవి

2017 ఎన్నికల్లో పటేళ్లు బీజేపీకి దూరం కావడంతో కేవలం 99 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పుంజుకుని 77సాధించింది. ఇది గమనించిన మోదీ ఏం చేశారంటే ఈసారి భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిని చేశారు. అంతేకాదు ఒకనాడు పటేళ్ల ఉద్యమాన్ని అణచివేసిన బీజేపీ, ఆనాడు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చారు. దీంతో 15శాతం ఉన్న పటేళ్లు బీజేపీవైపు మొగ్గు చూపడంతో విజయ దుందుభి మోగించింది.

2. దళిత, గిరిజన ఓట్లను బీజేపీవైపు తిప్పిన మోదీ

దళిత, గిరిజనుల ఓట్లు పొందడంలో మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ముఖ్యంగా దళిత ఓట్లు పొందేందుకు పలువురు దళిత నేతలకు వివిధ ప్రభుత్వ సంస్థల్లో పదవులు కట్టబెట్టారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు వారికి చేరేలా చేశారు.గిరిజనుల ఓట్ల కోసం స్వయాన ప్రధాని నరేంద్రమోదీ ఆదివాసీ ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించారు. అలాగే కాంగ్రెస్ నుంచి పదిసార్లు గెలిచిన మోహన్ సిన్హ్ రత్వాను పార్టీలో చేర్చుకుని ఆదివాసీలను బీజీపీ వైపు తిప్పారు.

3. అన్నింటికీ మించి… జనాకర్షణ శక్తి

ప్రధాని మోదీకి ఉన్న జనాకర్షణ శక్తి ఈ కా లంలో మరో నాయకుడికి లేదంటే అతిశయోక్తి కాదు. మోదీ ఏం మాట్లాడినా ప్రజలందరూ చూస్తారు. చర్చించుకుంటారు. అంతటి శక్తివంతమైన ఆయన ‘‘ఈ గుజరాత్ ను నేనే తీర్చిదిద్దాను’’ అన్న ఒక్కమాటతో జనం దృష్టిని ఆకర్షించారు. మీకు అభ్యర్థి ఎవరన్నది కాదు, కమలం గుర్తుకి ఓటేస్తున్నామా? లేదా? ఇదొక్కటే ఆలోచించండి అని చెప్పడం బాగా కలిసి వచ్చింది.

4. వ్యతిరేక ఓట్లను చీల్చిన అప్, కలిసివచ్చిన కాంగ్రెస్ వైఫల్యాలు 

 ‘అప్’ ఎప్పటికైనా కొంప ముంచేలాగే ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. బీజేపీ సామ్రాజ్యమైన గుజరాత్ లో నేడు వారు ఐదు సీట్లవరకు లీడింగ్ లో ఉన్నారని అంటే కోటలో పాగా వేశారనేది నిజం. భవిష్యత్ లో బీజేపీకి కాంగ్రెస్ తో కాదు, అప్ తోనే పోటీ అని అందరూ అనుకునేమాట. ప్రస్తుతం మాత్రం అప్ వ్యతిరేక ఓట్ల ను చీల్చింది. అంది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కూడా వీరికి బాగా కలిసివచ్చాయి.

5.  ప్లానింగ్, 60మంది సిట్టింగులపై యాక్షన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్లానింగ్ తో పాటు, యాక్షన్ లోకి దిగితే, ఎప్పుడు రాంగ్ అవదనే సంగతి అందరికి తెలిసిందే. ఈసారి కూడా 60మంది సిట్టింగు ఎమ్మెల్యేలను పక్కన పెట్టేశారు.వారిలో మంత్రులు కూడా ఉన్నారు. వీరందరిపై ఉన్న వ్యతిరేకత పార్టీపై పడకుండా చూసుకున్నారు. హిందుత్వ అజెండాని పైకి తీశారు. ప్రపంచంలోనే ఎత్తయిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ద్వారకాలో కట్టిస్తానని ప్రజలకు మాటిచ్చారు. భగవద్గీతను 3డీ ఎఫెక్ట్ లో ప్రదర్శన అయ్యేలా చూస్తానని చెప్పారు. దీంతో హిందూ ఓట్లనీ ఇటు వచ్చి చేరాయి.

ఈ పంచ కారణాలు గుజరాత్ ఎన్నికల్లో పాంచ్ పటాకాలా పేలాయి. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల్లో మోదీ గెలవడానికి ప్రధాన కారణం దేశంలో అభివృద్ధి జరిగే ప్రతీది గుజరాత్ కి రావల్సిందే. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇక్కడికే వేస్తున్నారు. ఐటీ కంపెనీలన్నీ అహ్మదాబాద్ లో ఉండాల్సిందే.  ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గుజరాత్ లో విజయానికి దోహదపడ్డాయని చెప్పాలి.

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. సూపర్‌-8లో ఆస్ట్రేలియాపై అఫ్గనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాంటింగ్, బౌలింగ్‌,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్