US Gunfire |అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. ఈస్ట్ మెయిన్ స్ట్రీట్‌లోని లూయివిల్లోని ఓ బ్యాంకు భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృత్యుఒడికి చేరారు. అయితే ఈ కాల్పుల్లో నిందితుడు సైతం మరణించినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. కాల్పుల్లో ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
US Gunfire |పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈస్ట్ మెయిన్ స్ట్రీట్‌లోని లూయివిల్లోని ఓ భవనంలో గల ఓల్డ్ నేషనల్ బ్యాంక్ లో దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే కాల్పులు జరపడానికి ముందే లూయివిల్ మెట్రో పోలీస్ శాఖ వెంటనే ప్రజలను అప్రమత్తం చేసిందని వివరించారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఈ దుర్ఘటనలో పలువురుమృతి చెందారని పేర్కొన్నారు. అయితే అక్కడున్నవారు మాత్రం తుపాకీ శబ్దాలు వినిపించగానే భవనం నుంచి బయటకు పరుగులు తీశారని… దీనిని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీస్ శాఖ వెంటనే చేరుకొని.. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రులకు తరలించినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.
Read Also: సీపీఐకి జాతీయ హోదా రద్దు చేయడం విచారకరం: సీపీఐ నారాయణ
Follow us on: Youtube, Instagram, Google News