స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే మొట్టమొదటి మహిళా న్యూస్ ప్రెజెంటర్ గీతాంజలి అయ్యర్(70) మృతిపై పలువురు జర్నలిస్టులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆమె సేవలను కొనియాడుతున్నారు. కోల్‌కతాలోని లొరేటో కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన గీతాంజలి 1971లో దూరదర్శన్‌లో చేరారు. వార్తలు చదవడంతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఉత్తమ యాంకర్‌గా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. 1989లో ఔట్‌స్టాండింగ్ మహిళగా దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చేతులమీదుగా ప్రియదర్శని అవార్డు అందుకున్నారు. దూరదర్శన్‌లో ఇంగ్లిష్ న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసిన ఆమె గత కొంతకాలంగా పార్కిన్‌నన్స్ అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోనే ఆమె కుప్పకూలిపోయి మరణించారు.