స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న ఎంఎస్ఎన్ కంపెనీలో అర్ధరాత్రి రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు యాజమాన్యం హైదరాబాద్ డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారు రాజు కోలా (28), దివారి డోలి (21) గా గుర్తించారు.


