హైదరాబాద్ లోని మల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని ఓ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.