హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున డిపోలో మంటలు వ్యాపించడంతో అక్కడే ఉన్న నలుగురు సజీవదహనం అయ్యారు. పక్కనే ఉన్న ఇళ్లకు కూడా మంటలు అంటుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిని వరంగల్ జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.