మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన ఈ విమానం శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు పచ్చని పొలాల్లో కూలిపోవడంతో.. ఇద్దరు ఫైలట్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. విమానం కాలి బూడిదైంది. విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. మిరాజ్ 2000ని ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించిందని అధికారులు తెలిపారు.