స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ధాన్యం అమ్ముకోవడానికి రైతుల తిప్పలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైనా వరి ధాన్యం కొనట్లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ధాన్యం కొనట్లేదని అడిగితే లారీలు రావట్లేదని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఎవరు లారీలు తెచ్చుకుంటారో వాళ్ళ ధాన్యం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని అన్నారు. వర్షానికి ధాన్యం తడిచి మొలకెత్తుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.