స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 3 గంటల కరెంటే దిక్కు అన్నారు. తెలంగాణలో 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. 3 గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా? రైతులు తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ని గెలిపించి తప్పు చేశామని కర్నాటక ప్రజలు అనుకుంటున్నారన్నారు. దేశంలో ఏ ఒక్కరినీ కాంగ్రెస్ ఓన్ చేసుకోలేకపోయిందన్నారు. ప్రతీ నాయకుడిని, ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ దూరం చేసుకుందన్నారు. నీళ్లు, కరెంట్, ఎరువులు ఇవ్వనోళ్లని మళ్లీ గెలిపించాలా అని ప్రశ్నించారు. 11 సార్లు అవకాశం ఇచ్చినా మళ్లీ అవకాశం కావాలంటున్నారని మండిపడ్డారు.