31.2 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

నాతో ఫొటో దిగాలనుకునే వాళ్లకు ఆ కండీషన్ పెట్టాను: చిరంజీవి

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్‌కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని వివరించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్‌కి సీఈవోగా ఉన్నారు. మరో మిత్రడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తున్నారు. స్వామి నాయుడు అలుపెరగని సైనికుడిలా, జీవితాన్ని అంకితం చేస్తూ కొనసాగుతున్నారు. ఆయనే నా బలం. వీళ్లంతా నా వెన్నుదన్నులా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాను. మేము సైతం అన్నట్టుగా నా అభిమానులు, సోదరసోదరీమణులు రక్త దానానికి ముందుకు వస్తున్నారు. రేపు మనం ఎక్కడున్నా సరే ఈ సేవా కార్యక్రమం మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది. రక్తం పంచిన, రక్తం ఇచ్చిన నా సోదరసోదరీమణుల సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.

ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనిని కూడా మనం ప్రారంభించకూడదు. దీని పర్యవసానాలు ఏంటి? ఇలా చేస్తే ఏం వస్తుంది? అని ఆలోచించకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. రక్తం ఇవ్వడానికి ఒకప్పుడు చాలా భయపడేవాళ్లు. కొంత మంది డబ్బు ఆశ చూపించి రక్తం తీసుకునేవారు. ఇప్పటిలా స్వతహాగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అనేది అప్పట్లో లేదు. సరైన టైంకి రక్తం అందక ప్రాణాలు పోతోన్నాయని తెలిసి బాధ పడేవాడ్ని. డెలివరీ టైంలో అధిక రక్తస్రావం జరగడం, తలసేమియా, లుకేమియా, ప్లేట్ లేట్స్ లేక చాలా మంది చనిపోతోన్నారని తెలుసుకున్నాను.

నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారు కదా.. వీరంతా యువకులు.. వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా అని అనుకున్నాను. అలాంటి టైంలోనే స్వామి నాయుడుని ఈ కార్యక్రమానికి అంకితం కావాలని కోరాను. రక్తం ఇవ్వమని అభిమానుల్ని కోరితే వారు ఇస్తారా? అని మొదట్లో సందేహపడ్డాను. నాతో ఫోటో దిగాలని, నన్ను కావాలని కోరుకునే వారంతా ముందు రక్తం ఇవ్వండి అని కండీషన్ పెట్టాను. ఆ టైంలో ఉత్సాహవంతమైన కుర్రవాళ్లంతా రక్తం ఇచ్చారు. నాతో ఫోటో దిగారు. ఇది నిరంతరం సాగుతుందా? ఇచ్చిన వాళ్లు మళ్లీ ఇస్తారా? ఆసక్తి చూపిస్తారా? అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో కొన్ని పదులు, వందల సార్లు రక్తం ఇచ్చిన వారున్నారు. సేవా కార్యక్రమంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు కాబట్టే ఇన్ని సార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది. నా తరువాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. మంచి చేస్తే తిరిగి మంచే జరుగుతుందని భావిస్తుంటాను.

ఓ సారి నేను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్తే.. అక్కడి నాయకులు ఒకరు నా మీద అవాకులు చవాకులు పేలారు. అలాంటి మాటలన్నీ నేను పట్టించుకునే వాడ్ని కాదు. కానీ నన్ను అభిమానించే వాళ్లు అలా ఉండరు కదా. ఓ సారి ఆ నాయుకుడిని ఓ మహిళ చెడమడా తిట్టేశారు. ఎందుకు ఇలా తిట్టింది? అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని కనుక్కోమని చెప్పాను. ఆమె నా అభిమాని కాదని అప్పుడు తెలిసింది. మరి ఎందుకు ఆయన కోసం ఆ నాయకుడిని తిట్టావు అని అంటే.. చిరంజీవి గారి వల్లే నా బిడ్డ ప్రాణాలు నిలబడ్డాయి. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తం దొరక్క కష్టాలు పడుతుంటే.. వారి వల్లే నా బిడ్డ బతికాడు. ఆయన నాకు దేవుడితో సమానం.. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టమొచ్చినట్టు తిడితే కోపం రాదా? అని ఆ మహిళ అన్నారు. మనం చేసిన పుణ్యం ఎక్కడికీ పోదని నాకు అప్పుడు అర్థమైంది. అందుకే పెద్దలు ధర్మో రక్షితి రక్షిత: అంటారు. మన ధర్మం మనం పాటిస్తే, మంచి పనులు చేస్తే అవే తిరిగి వస్తాయి. అందుకే మంచి పనులు చేయండి, పాజిటివ్‌గా ఆలోచించండని అందరికీ చెబుతుంటాను. నన్ను ఎంత మంది తిట్టినా, అకారణంగా ఏమైనా అన్నా కూడా నేను పట్టించుకోను. మనసుకు తీసుకోను. ప్రశాంతంగా ఉంటాను. మీ అందరి సహకారం వల్లే నేను ఇంత చేయగలుగుతున్నాను. రక్తదాతలే దేవుళ్లు. నేను సంధాన కర్తను మాత్రమే. ఈ పుణ్యమంతా కూడా మీదే.

డబ్బుని ఆశించకుండా, ఫ్రీ సర్వీస్ చేసేందుకు శంకర్, నాయుడు, స్వామి నాయుడు వంటి వారు ముందుకు వచ్చారు. వీళ్లందరికీ నా కృతజ్ఞతలు. APTA ఈవెంట్‌కు వెళ్లినప్పుడు నేనేం మాట్లాడాలని అనుకున్నాను. నేనేమీ వ్యాపారవేత్తను కాదు.. ఏం మాట్లాడాలా? అని ఆలోచించాను. అందుకే నా గురించి చెప్పాను.. నేను నా సినీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాను.. ఈ స్థాయికి ఎలా వచ్చానో చెప్పాను. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా, టాలెంట్ మీద నమ్మకం, బలీయమైన సంకల్పం, అందరి కంటే ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాను. డ్యాన్సులు, ఫైట్లలో నా ముద్ర వేశాను. రిపీటెడ్‌గా పాటలు, ఫైట్లు వేయించుకుని చూసేవారు. అదే నా ప్రత్యేకత. దాని వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇతనితో చేస్తే డబ్బులు వస్తాయి.. ఇతని కోసం రిపీటెడ్‌గా ఆడియెన్స్ వస్తున్నారు.. ఇతనితో చేస్తానంటే డబ్బులు పెడతామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా నన్ను ముందుగా ఆడియెన్స్ ఆదరించారు. ఆ తరువాత కళామతల్లి నన్ను అక్కున చేర్చుకుంది. అందుకే నేను ఆడియెన్స్‌కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. ఆడియెన్స్, అభిమానుల సంకల్పం వల్లే ఈ బ్లడ్ బ్యాంక్ నిరంతరంగా సాగుతూ ఉంది. ఇలా రక్తదాతల్ని కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది మీ ఇళ్లు లాంటిది.. మీకు నచ్చినప్పుడు వచ్చి రక్తాన్ని దానం చేయొచ్చు. లవ్ యూ ఆల్’ అని అన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు అడ్డంకి ఎవరు?

కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? వారి గెలుపోటములకు ఎవరు అడ్డంకిగా ఉన్నారు? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలోని నాలుగు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్