స్వతంత్ర వెబ్ డెస్క్: ఈ రోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నిన్న మధ్యలో ఆపి వాయిదా పడడంతో దానిని కొనసాగించారు. ఉదయం చంద్రబాబు మరియు సిఐడి తరపున లాయర్లు తమ వాదననాలను సుప్రీమ్ కోర్ట్ కు వినిపించారు. ఈ రోజు వాదనలతోనూ ఒక స్పష్టత రాని ధర్మాసనం ముందుగా మధ్యాహ్నానికి వాయిదా వేసి, ఆ తర్వాత శుక్రవారానికి వాయిదాను మార్చింది. దీనితో మళ్ళీ క్వాష్ పిటిషన్ మీద తీర్పుకోసం చంద్రబాబు మూడు రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ రోజు చంద్రబాబును కలవడానికి బ్రాహ్మణి , భువనేశ్వరి లు వెళ్లారు..వీరితో పాటుగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా వెళ్లారు. వీరంతా కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు మరియు అరెస్ట్ తదనంతర పరిణామాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడప్పుడే చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చేది కుదిరేలా కనిపించకపోవడంతో టీడీపీ కార్యక్రమాలు మరియు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అన్న పలు విషయాలపై చర్చించారని తెలుస్తోంది.