వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల. వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకుం డా చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించారని విమర్శించారు. ఒక్కప్పుడు వాలంటీర్లపై ఎన్నో ఆరోపణలు చేసిన చంద్రబాబు, ఇప్పుడు వారిని కొనసాగిస్తామంటున్నా రని తెలిపారు.. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నా రని అన్నారు. చంద్రబాబు రోజుకో మాట మారుస్తారని ఆరోపించారు.. 2014లో చేసిన మోసాన్నే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని చెప్పారు. నాలుగు ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు వస్తాయన్న ఆయన… జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే పథకాలు అందుతాయని ఎద్దేవా చేశారు.


