నేవీ అధికారిగా చెలమాణి అవుతున్న చలపతిరావుపై విజయవాడలో కూడా గతంలో ఇదే తరహా కేసు నమోదైంది. నకిలీ ఐడీ కార్డుతో నేవీ క్యాంటీన్‌లో సామగ్రి కూడా కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన అగ్నివీర్ ఉద్యోగాలు ఇప్పిస్తాంటూ నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా నిందితుడు నకిలీ నేవి అధికారి అవతారం ఎత్తినట్లు పోలీసులు గుర్తించారు.
చలపతిరావుపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఆరు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశాఖపట్నంలోని ఒన్ టౌన్, టూ టౌన్, మల్కాపురం, విజయవాడలోని పెనమలూరు సహా పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై చీటింగ్ కేసులు ఉన్నట్లు చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడమే చలపతిరావు ప్రవృత్తి అని పోలీసులు తెలిపారు. చలపతిరావు ఇప్పటి వరకు 15 మంది బాధితుల నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశాడని పోలీసులు వెల్లడించారు. ఈజీ మనీ, జల్సాలకు అలవాటు పడ్డ చలపతిరావు తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించేందుకు ఇలాంటి దారి ఎంచుకున్నాడని వివరించారు.