ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్టాన్లీ యాప్ ద్వారా లక్షల రూపాయలు చెల్లించి వందల మంది ప్రజలు మోసపో యారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో రాజేష్, మస్తాన్ అనే వ్యక్తులు వారి స్వలాభం కోసం ప్రజలకు మాయమాటలు చెప్పారు. సమావేశాలు ఏర్పాటు చేసి ఈ యాప్ ద్వారా లక్ష రూపాయలు కడితే పది లక్షలు వస్తుందని ఆశ పెట్టారు. తమకు లక్షల రూపాయలు వచ్చాయని, కార్లు ఇచ్చారని, జీతమిస్తున్నారని అమాయక ప్రజలను నమ్మించారు. డబ్బు కట్టించుకోని తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు.


