కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెలతో పీసీ ఘోష్ కమిషన్ గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. కమిషన్ ముందు విచారణకు హాజరైన ప్రాజెక్టుకు సంబంధించిన మాజీ ఈఎన్సీ లు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పూర్తి వివరా లతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. దీంతో గురువారం వరకు 60 మంది సీల్డ్ కవర్లలో అఫిడవిట్లు దాఖలు చేసిన ట్లు తెలిసింది.