30.4 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

బ్యారేజీలను పరిశీలించిన నిపుణులు

   మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇవాళ మరో నిపుణుల బృందం మేడిగడ్డకు వెళ్లనుంది. NDSA సూచనలతో ఇవాళ మేడిగడ్డకు NGRI రీసెర్చ్‌ టీమ్‌ సందర్శించనుంది. మూడు బ్యారేజీలను పరిశీలించనున్న నిపుణులు త్వరలో నివేదిక ఇవ్వనుంది.

   మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో ఏర్పడిన భారీ గొయ్యిని 25 వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా ఏడో బ్లాక్‌ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్న చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్‌ నివేదిక అందుబాటులో లేదని తెలుస్తోంది. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ సూచించగా 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారి నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్‌ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి. ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటు న్నాయి.

    మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా కుంగిన ఏడో బ్లాక్‌ వద్ద ఏరియా క్లియరెన్స్‌ పనులను చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్‌ ప్లాట్‌ఫాం ఎదుట పెద్ద బుంగ బయటపడింది. బుంగను ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చేశారు. ఏడో బ్లాక్‌ ప్రదేశంలో పలు చోట్ల చిన్న బుంగలు ఏర్పడగా వాటిని కూడా పూడ్చేసినట్లు సమా చారం. గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్‌ పైల్స్‌కు 20 మీటర్ల దూరంలో భారీ గొయ్యి బయటపడగా ఇసుక బస్తాలతో పూడ్చేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాకులకు దగ్గరగా పెద్ద బుంగను గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లన్నీ ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఆరో బ్లాక్‌ వరకు, అలాగే ఎనిమిదో బ్లాక్‌లోను ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తి స్థాయి నీటిమట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా ఎనిమిది గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. రెండు గేట్లను పూర్తిగా తొలగించాలి. ఆరు ఎత్తాల్సి ఉంది. ఇందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి.

    ఇక, 16వ నంబరు గేటు ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని భావిస్తు న్నారు. ఎత్తడానికి వీలు లేకుంటే ఈ గేట్లను కూడా తొలగించాలి. ఏడో బ్లాక్‌ ప్రాంతంలో షీట్‌ పైల్స్‌ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్‌ అమరిక పనులు ప్రారంభించారు. బోర్‌వెల్‌ డేటా కోసం డ్రిల్లింగ్‌ కూడా చేస్తున్నారు.జియో ఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్