స్వతంత్ర, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన రమణ పై వివాదాలు వెల్లువెత్తుతున్నాయి. పొట్టి దాయి కాడమ్మ గట్టిదాయమ్మ అను పాటను తన దగ్గర నుంచి కాజేసి పల్సర్ బైక్ రమణ పాపులర్ అయ్యాడంటూ సురేష్ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విజయనగరం కేంద్రంలో నివాసం ఉంటున్న సురేష్… పల్సర్ బైక్ రమణ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాట బాగా పాపులర్ అవడంతో ఇప్పుడు నా పాటలు పల్సర్ బైక్ రమణ కాపీ కొట్టాడని ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన రవితేజ సినిమాలో కూడా పాట బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది.