17.2 C
Hyderabad
Sunday, February 15, 2026
spot_img

మళ్లీ అధికారం బీజేపీదే అంటూ ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు

     కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడడంతో కాషాయ పార్టీలో నూతనో త్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కన్యాకుమారిలో దాదాపు 45గంటల పాటు ధ్యానం ముగించుకున్న ప్రధాని మోదీ వివిధ అంశాలపై సమీక్షలతో ఇవాళ షెడ్యూల్‌ బిజీ బిజీగా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన ‘తొలి 100 రోజుల’ ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రెమాల్‌ తుపాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నతా ధికారులతో ప్రధాని మోదీ తొలుత రివ్యూ నిర్వహించనున్నారు. అనంత రం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుం బాలకు సాయంపై సమీక్ష చేయనున్నారు. వీటితోపాటు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపైనా ఉన్నతాధికారులతో చర్చించనున్నా రు.మూడోసారి అధి కారం చేపట్టిన తర్వాత మొదటి 100 రోజుల కార్యాచరణపైనా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ మేధో మథనం జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఎన్నికలకు ముందే కేంద్ర మంత్రులకు సూచిం చారు. వంద రోజుల్లో అమలు చేయాల్సిన కార్యక్రమాల ప్రాధాన్యతా క్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్