స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pavankalyan) ఋషికొండలో(Rushikonda) ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని పరిశీలించేదుకు వెళ్లే ప్రయత్నాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం పవన్ ఋషికొండకు వెళ్లాల్సి ఉంది. ఋషికొండ నిషేధిత స్థలం కాదని అయినా అక్కడికి వెళ్లకుండా చెక్ పోస్ట్ పెట్టడం పోలీసులు అడ్డుకోవడం సరికాదని జనసేన పార్టీ(Jenasena Party) స్పష్టం చేసింది. రాజ్యాంగ హక్కుతో…ప్రజలకోసం ఋషికొండ పర్యటనకు పవన్ వెళ్లాలని స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని జనసేన ప్రకటించంది. అడ్డుకోవడానికి మీకు ఏం హక్కు ఉందని జనసేన నేతలు ప్రశ్నించారు. అడ్డుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఋషికొండ పీపుల్స్ ల్యాండ్.. ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి… ఆ అవసరం లేదన్నారు. 3 గంటలకు పవన్ కళ్యాణ్ రుషికొండకు వెళ్లి తీరతారు. పర్యటన తరువాత నిజానిజాలు బయట పెడతారని జనసేన నేతలు స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఋషికొండ, ఎర్రమట్టి (Erramatti)దిబ్బల్ని పర్యటించేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇందుకు నిరాకరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎలాగైనా ఋషికొండవెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు చూద్దామనే ధోరణిలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నోవోటెల్ హోటల్ తో పాటు ఋషికొండ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎవరినీ ఇక్కడకు రాకుండా అడ్డుకుంటున్నారు. నోవోటెల్ హోటల్లో జనసేన నేతలతో సమావేశం తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళాలని పవన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.