ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు నియోజకవర్గాలకు రేపు జరగబోయే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. ఇక ఉదయం ఏడు గంటల నుంచే ఉద్యోగులు నియోజకవర్గాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్నారు. ఇక జిల్లా లో మొత్తం 368 బ్యాలెట్ యూనిట్లు, 42 వీవీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. 16లక్షల 34వేల 122 మంది ఓటర్లకు గాను 1,640 పోలింగ్ స్టేషన్లలో 167 రూట్లు రెడీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,968 పోలింగ్ ఆఫీసర్స్, 1,968 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 7వేల 872 ఓపీఓలు, 397 మంది మైక్రో అబ్జర్వర్లను అధికారులు నియమించారు.


