24.8 C
Hyderabad
Sunday, June 22, 2025
spot_img

ప్రతి క్షణం ప్రజల పక్షం

  రామోజీరావు అంటే ఓ వ్యక్తి కాదు వ్యవస్థనే చెప్పాలి. అవును.. ఓ పత్రిక, మీడియా అధిపతిగా పలు మార్లు ప్రభుత్వా లకు వ్యతిరేకంగా సామాన్యుల గొంతుకను విన్పించారు. సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఒత్తిడి చేశారు. ఇక, అక్కచెల్లెమ్మల పాలిట శాపంలా మారిన సారాకు వ్యతిరే కంగా ఉద్యమించారు రామోజీరావు.

ఈనాడు..! ఈ పేరు చెబితే విన్పించేది మొదటగా సామాన్యుల గొంతుకే. నిజమే  ప్రజల కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ఇలా విషయం ఏదైనా ఈనాడు తన గొంతుకను విన్పించేది. ప్రజల తరఫున పోరాటం చేసేది. ఈ క్రమంలో అటువైపు ఉన్నది సర్పంచా, జెడ్పీటీసీయా, ఎమ్మెల్యేనా, ఎంపీనా.. మంత్రా, లేదంటే చివ రకు ముఖ్యమంత్రా అన్నది కూడా చూసేది కాదు ఈనాడు.

   అవును ఈనాడు అంటే కేవలం వార్తలు, వింతలు, విశేషాలు చూపించే మాధ్యమమే కాదు.ఎన్నో సమ స్యలు, సవాళ్ల కు పరిష్కారం చూపే వేదిక, తెలుగువారి ఆత్మగౌరవ పతాక. ఎక్కడిదాకో ఎందుకు ఎన్నో సార్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వాల ఏర్పాటులో, ముఖ్యమంత్రుల ఎంపికలో కీలక పాత్ర పోషిం చింది ఈనాడు. 1978 నుంచి 83 మధ్య కాలంలో నాటి కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో నలుగురు ముఖ్య మంత్రుల్ని మార్చేసింది. దీంతో ఎన్టీఆర్ నేతృత్వం లో టీడీపీ ఆవిర్భ వించింది. అయితే నాడు ఎన్టీఆర్ పార్టీపెట్టిన కొన్ని నెలల్లోనే అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేసింది ఈనాడు. తెలుగు దేశం పార్టీ విధానాలను, ఎన్టీఆర్‌ సీఎం కావాల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లింది. ఎన్టీఆర్ ప్రసంగాలకు పేపర్‌లో విశేషంగా ప్రాధాన్యం కల్పించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే నాడు అన్నగారు సీఎం అయ్యారంటే రామోజీరావు, ఈనాడు కృషి వెలకట్టలేనిది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.అయితే కేవలం ఇక్కడితోనే ఆగిపోలేదు ఈనాడు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పులను సైతం ప్రస్తావించేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తనవంతు పాత్రను సమర్థంగా పోషించింది. తిరిగి ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయ్యేందుకు సాయపడింది. ఆ తర్వాత కూడా రాష్ట్రంలో కొలువుతీరిన పలు ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు సానుకూలంగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతి రేకంగా కథనాలు ఇచ్చింది. నిజాలను నిర్భయంగా వెల్లడించడంలో ఈనాడు ఎప్పుడూ ముందు ఉంటుందని నిరూ పించింది.

 కేవలం ఇదే కాదు. సామాజిక ఉద్యమాలను సైతం ఈనాడు సమర్థంగా ముందుకు నడిపింది. అందుకు తిరుగులేని ఉదాహరణ సారా వ్యతిరేక ఉద్యమం. 1992లో నెల్లూరు జిల్లా దూబగుంటలో సారాపై కన్నెర్ర చేసిన మహిళలకు బాసటగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతమిచ్చింది. తద్వారా అందరి ప్రశంసలు అందుకుంది. ఇక, ఈనాడు 1995లో చేపట్టిన శ్రమదానోద్యమం ఊళ్లకు ఊళ్ల నే భాగస్వాములను చేసింది. చెరువుల్లో పూడిక తీత, రోడ్ల మరమ్మతులకు గ్రామస్థులు స్వచ్ఛంధంగా కదిలేలా స్ఫూర్తి నింపింది. తుపాన్లు, ఇతర విపత్తుల సమయంలో బాధితులకు ఎన్నోసార్లు అండగా నిలి చింది. తద్వారా సామాన్యుల స్వరంగా ప్రతి అడుగులోనూ ఈనాడు తన ముద్రను వేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్