రాష్ట్ర ఖజానాను జగన్ ఖాళీచేసినా, పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని జులై ఒకటిన టీడీపీ సర్కార్ పెన్షన్లు అందజేస్తుందని మంత్రి రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండల పరిషత్ కార్యాలయంలో పెన్షన్ల పంపిణీపై అధికారులతో ఆయన సమీక్షించారు. పెన్షన్లు, పెంచిన సొమ్ము లబ్ధిదారులకు నేరుగా అందించాలని మంత్రి ఆదేశించారు. ఏపీలో మొత్తం 65.18 లక్షల మందికి 4 వేల 404 కోట్ల రూపాయలు పెన్షన్లుగా అందజేస్తున్నట్లు చెప్పారు రామానాయుడు. లబ్ధిదారులకు చంద్రబాబు నేరుగా పెన్షన్ పంపిణీ చేస్తారన్నారు. పెన్షన్లను సీఎం నేరుగా అందించడం చరిత్రాత్మకం అన్నారు.