పేదవాడి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చెప్పారు. అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు నాయకర్ అన్నారు. దానిలో భాగంగా ఈ నెల 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే దిశగా పయనిస్తోందని అన్నారు. ఎమ్మెల్యే నాయకర్‌తో పాటు నరసాపురం టీడీపీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.