15.2 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

‘ఎర్రచీర’ యాక్షన్ ట్రైలర్ ప్రోమో విడుదల

పద్మాలయ ఎంటర్టైన్మెంట్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హరర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ చిత్రం ‘ఎర్రచీర’. శ్రీరామ్, అయ్యప్ప పి శర్మ, కారుణ్య చౌదరి, కమల్ కామరాజు, బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రధారులుగా సుమన్ బాబు దర్శకత్వం వహించి, నటించిన ఈ చిత్రం.. అత్యద్భుతమైన గ్రాఫిక్స్‌తో యాక్షన్ సెంటిమెంట్, హార్రర్ కోణాలతో ఉన్న యాక్షన్ ట్రైలర్‌ను దసరా కానుకగా విడుదల చేయనున్నారని నిర్మాతలలో ఒకరైన ఎన్ వి వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ట్రైలర్‌కు సంబంధించిన ప్రోమోను ఆదివారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ యాక్షన్ ట్రైలర్‌తో ఎర్రచీర అంచనాలను భారీగా పెంచుతుందనీ, నందు మాస్టర్ చేసిన ఫైట్స్ సరికొత్తగా ఉంటాయని.. కారుణ్య చౌదరి, సాయి తేజస్విని హర్రర్ ఎపిసోడ్స్ భయానకంగా ఉంటాయని దర్శక నిర్మాత సుమన్ బాబు తెలిపారు. రఘుబాబు, అజయ్, అలీ, బిగ్‌బాస్ భానుశ్రీ, జీవ, మహేష్, భద్రం, గీత సింగ్, అన్నపూర్ణమ్మ, సత్యకృష్ణతో పాటు ప్రత్యేక పాత్రలో సురేష్ కొండేటి నటించారు.

ఈ చిత్రానికి టెక్నీషియన్స్
ఫోటోగ్రఫీ – చందు
మాటలు – గోపి విమల పుత్ర
ఎడిటర్ – వెంకట ప్రభు
మ్యూజిక్ – ప్రమోద్ పులిగెర్ల
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ – ఎస్ చిన్న
SFX – ప్రదీప్
ఆర్ట్ – నాని, సుభాష్
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహ్మాన్, కరణ్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
నిర్మాతలు – ఎన్వీ.వీ. సుబ్బారెడ్డి, సుమన్ బాబు
కో డైరెక్టర్ – నవీన్ రామ్ నల్లంరెడ్డి, G.రాజమోహన్.
కథ – స్క్రీన్ప్లే – దర్శకత్వం :- సి.హెచ్. సుమన్ బాబు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్