Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఈవో ధర్మారెడ్డి రైస్ మిల్లర్లతో భేటీ అయ్యారు. తిరుమల ప్రసాదానికి బియ్యం సరఫరాపై వారితో మాట్లాడారు. టీటీడీకి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన బియ్యాని సరఫరా చేయాలని ఈవో మిల్లర్లను కోరారు. ఈవో కోరడంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తికి అనుగుణంగా బియ్యాన్ని సరఫరా చేసేందుకు రైస్ మిల్లర్ల అంగీకారం తెలియజేశారు. దీంతో ఈవో ధర్మారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.