ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 14 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్‌కౌంటర్ తర్వాత, 1SLR సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్ (SOG), ఛత్తీస్‌గఢ్ పోలీసులు, CRPF జాయింట్ టీమ్‌లు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని కులపరా, ఒరిస్సాలోని నౌపడా జిల్లా అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. తెల్లవారుజామున జరిపిన కూంబింగ్ లో మరో 14 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.