32.5 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

ట్విట్టర్కు కొత్త సీఈఓను వెతికే పనిలో ఎలాన్ మస్క్

  • ట్విటర్‌ సీఈఓగా కొనసాగాలా? వద్దా..? అని ప్రశ్నిస్తూ పోల్
  • మస్క్కు వ్యతిరేకంగా ఓటు వేసిన యూజర్లు

ట్విట్టర్కు​ కొత్త బాస్​ ఎలాన్​ మస్క్​ తన స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. తెలివి తక్కువోడు దొరకగానే తాను తప్పుకుంటా అని అన్నారు ఎలన్‌మస్క్‌. అక్టోబరులో ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సీఈఓగా కొనసాగాలా? వద్దా..? అని ప్రశ్నిస్తూ మస్క్‌ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది యూజర్లు.. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్‌లో .. కేవలం ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు వీలుగా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. అయితే, యూజర్లు తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ట్విటర్‌ సీఈఓగా వైదొలగాలని మస్క్‌ భావిస్తున్నారు. ఈ మేరకు ట్విటర్‌కు కొత్త బాస్‌ను అన్వేషించే పనిలో.. మస్క్ నిమగ్నమయ్యారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్