స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. తెలంగాణలో మరికొన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ‘ఈ-గరుడ’ పేరుతో ప్రయాణికులకు రేపటి నుండి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులను హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రవేశపెట్టనుంది. విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు ప్రయాణించేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ఈ మార్గంలో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలనే నిర్ణయం తీసుకున్నారు. మొదటగా 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. మియాపూర్ లో రేపు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల ప్రారంభోత్సవం జరుగనుంది.