బీజేపీను దెబ్బతీయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్య నేతలు, వివిధ మోర్చాల అధ్య క్షులు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల కార్యాచరణవ్యూహాలు, ప్రచారం, సభలు, మేనిఫెస్టోపై సమా వేశంలో చర్చించారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచించారు.