ప్రకాశం జిల్లా దర్శి మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అతని సతీమణి నందిని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమకు అడుగడుగునా ప్రజలు పూలాభిషేకలతో బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగన్ సంక్షేమ పథకాలు పార్టీలకి అతీతంగా ఇవ్వడం జరిగిందని ,జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవాళ్లకు అందిస్తు న్నారన్నారు. 2014లో చంద్రబాబు సుమారు 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శిం చారు. ప్రస్తుతం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు ఎవరూ లేరని, మళ్లీ జగన్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తంచేశారు.


