సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
మోదీ ప్రసంగంలో కీలక అంశాలు
1.. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉంది. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించింది.
2..అధికార, ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగంపై వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
3..సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మా విధానం. అందుకే దేశం ఇక్కడ మమ్మల్ని నిలబెట్టింది.
4..కానీ కాంగ్రెస్ నినాదం ఫ్యామిలీ ఫస్ట్. సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌పై కాంగ్రెస్ ఎప్పుడూ విశ్వసించలేదు
5..సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పే అవుతుంది. ఇది వారి ఆలోచనకు మించినది. పార్టీ మొత్తం కుటుంబానికి మాత్రమే అంకితం చేయబడింది.
6..దేశ ప్రజలు మా అభివృద్ధి నమూనాను పరీక్షించారు.. అర్థం చేసుకున్నారు..మాకు మద్దతు ఇచ్చారు. మాది ‘నేషన్ ఫస్ట్’ విధానం
7.. కాంగ్రెస్ పాలనలో ప్రతి దానిలోనూ అసంతృప్తి ఉండేది. ఇది వాళ్లు చేసే రాజకీయం విధానం..
8..2014 తరువాత, భారతదేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వచ్చింది. ఈ మోడల్ అసంతృప్తిపై దృష్టి పెట్టలేదు. సంతృప్తిపై దృష్టి పెట్టింది.
9.. సమాజంలో కులం అనే విషాన్ని నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సంవత్సరాలుగా, అన్ని పార్టీల నుండి ఓబీసీ ఎంపీలు ఓబీసీ ప్యానెల్‌కి రాజ్యాంగ హోదాను కోరుతున్నారు. కానీ వారి డిమాండ్ తిరస్కరించబడింది, ఎందుకంటే ఇది వారి (కాంగ్రెస్) రాజకీయాలకు సరిపోకపోవచ్చు. కానీ మేము ఈ ప్యానెల్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చాము.
10. ఒకానొక సమయంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ ద్వేషించింది.
11.. అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. కానీ ఇప్పుడు వారు బలవంతంగా జైభీమ్ అని పలుకుతున్నారు.