స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని అది బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. బీజేపీ నాయకులతో తనకు పడటం లేదని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎవరితో విభేదాలు లేవని.. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వంలో ఓ సైనికుడిలా పని చేస్తున్నానని పేర్కొన్నారు. కాగా ఈటల పార్టీ మారబోతున్నట్లు కొన్ని పత్రికలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.