ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సీమెన్స్ సంస్థపై ఈడీ చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్.. ప్రాజెక్టు నిధులు మళ్లించాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ రెండు సంస్థలకు చెందిన వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, సౌమ్యాద్రి శేఖర్ బోస్‌తోపాటు వారి బినామీలు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేశ్ తదితరుల సాయంతో నిధులు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. దర్యాప్తులో భాగంగా సీమెన్స్‌కు చెందిన ఢిల్లీ, ముంబై, పుణేలోని స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొత్తం 23.54 కోట్లను అటాచ్ చేసింది. ఈ మేరకు విశాఖపట్నంలోని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు.