23.7 C
Hyderabad
Tuesday, February 27, 2024
spot_img

రైతుబంధుకు ఈసీ బ్రేక్‌..పేలుతున్న మాటల తూటాలు

ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది.. కేంద్ర ఎన్నికల సంఘం. రైతుబంధు సాయం పంపిణీకి ఇటీవలె ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే.. ఈసీ నిర్ణయంపై రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు బంధు సాయానికి బ్రేక్ పడడానికి కారణం మీరంటే మీరంటూ విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

తెలంగాణ ఎన్నికలు చివరి దశకు వచ్చేశాయి. ఈనెల 30న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. రైతుబంధు సాయం పంపిణీ చేసేందుకు ఇటీవలె ఇచ్చిన అనుమతిని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఈసీ.

వాస్తవానికి యాసంగి సీజన్ కోసం రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాత్రి అనుమతిచ్చింది. ఈనెల 28 వరకు చెల్లింపులు చేపట్టాలని సూచించింది. ఎన్నికల ప్రచార సభల్లో రైతు బంధు గురించి ప్రస్తావించవద్దని, లబ్దిపొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే షరతులు విధించింది ఈసీ. అయితే..ఇందుకు విరుద్దంగా మంత్రి హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని చెబుతూ అనుమతి వెనక్కు తీసుకుంటున్నట్లు ఆదేశాలిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.

రైతు బంధు సాయం పంపిణీకి ఈసీ బ్రేక్ వేయడంపై రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల వేళ నిధుల విడుదల ఆగిపోడానికి కారణం మీరంటే మీరంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు. ఏటా ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం పది వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. అయితే..ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డబ్బులు విడుదలవుతాయా లేదా అంటూ ఒకటే సందేహం నెలకొంది.

ఇదే సమయంలో ప్రచార పర్వం ఇలా మొదలైందో లేదో నేతల మధ్య రైతు బంధుపై విమర్శల జోరు రోజూ కొనసాగింది. రైతు బంధు సాయం నిలిపివేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం వల్లే బ్రేక్ పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తే..తాము అలా అనలేదంటూ గతంలో ఈసీకి రాసిన లేఖను సైతం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ విమర్శలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటీవలె రైతు బంధు సాయం పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే..ఇచ్చిన అనుమతికి రెండు మూడు రోజుల్లోనే మళ్లీ ఈసీ బ్రేక్ వేయడంతో నేతలు మరోసారి వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతోనే రైతు బంధు పథకం నిధుల విడుదలకు బ్రేక్ పడిందని ఆరోపించారు సీఎం కేసీఆర్. ఎంతకాలం ఇలా చేస్తారని.. అడ్డుకుంటారని.. ప్రచార పర్వంలో ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. బీఆర్‌ఎస్‌లోని ఇతర నేతలది సైతం ఇదే మాట. రైతుబంధు మీద కాంగ్రెస్‌ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు, కేటీఆర్. ఎంత ప్రయత్నించినా వచ్చేది తమ ప్రభుత్వమేనని.. మహా అయితే డిసెంబర్ మూడు వరకు మాత్రమే రైతుబంధును ఆపగలరని ఎద్దేవా చేశారు మంత్రులు.

రైతు బంధుకు ఈసీ బ్రేక్ వేయడంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల ఖాతాల్లోకి నగదు వేస్తామని హామీ ఇచ్చారాయన. ఈ పథకంతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆతృత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా అల్లుళ్లకు లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారాయన.

కాంగ్రెస్, బీజేపీ తెరవెనుక పన్నుతున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పదేళ్లకు ముందు తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందో..ఇప్పుడు బీఆర్‌ఎస్ ఏం చేసింది అన్నదానిపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ప్రచారం వేళ ఆయా పార్టీల నేతల మాటలు.. ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఈసీ అనుమతి నిరాకరణతో రాష్ట్రంలోని 70 లక్షల మంది కర్షకులకు రైతుబంధు సాయం నిలిచిపోనుంది.

Latest Articles

‘ఆపరేషన్ వాలెంటైన్’ విజువల్ ఫీస్ట్ లా వుంటుంది – చిరంజీవి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్