స్వతంత్ర, వెబ్ డెస్క్: పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా అంబెడ్కర్ పేరు పెడతారని అనుకున్నాం.. కానీ అలా జరుగేలేదన్నారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మోడీ పై విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఎన్ని పార్టీలు వచ్చాయి… ఏంత మంది ఎంపీలు వచ్చారో కేంద్ర మంత్రి చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు. మీది అంతా మోడీ వాదం.. జాతీయవాదం కాదని మండిపడ్డారు.
మేము ప్రజా సమస్యలపై బిజీగా ఉంటే…మీరు సోషల్ మీడియా నిర్వహణ పై వున్నారు. మోడీ కి వ్యతిరేకంగా సోషల్ మీడియా కదం తొక్కుతోంది.. మీరు తవ్విన గుంతలో మీరే పడ్డారని వ్యాఖ్యానించారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి ఇక లేదన్నారు. రాచరిక పాలన వైపు మళ్లించే మీ కుట్రను మేము అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. బీఆర్ఎస్ శక్తి మహారాష్ట్రలో చూసి మీ కాళ్ళ కింద భూమి కదులు తోంది… త్వరలో దేశ వ్యాప్తంగా మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ఉన్నత స్థానంలో ఉండాలని తాము కోరుకుంతున్నట్లు తెలిపారు.