స్వతంత్ర వెబ్ డెస్క్: ద్వారంపూడి గూండా, రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి.. జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా.. చంద్రబాబు కోసమా.. అంటూ పవన్ కల్యాణ్ కామెంట్లపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఫైర్ అయ్యారు. పవన్ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే పవన్ కాకినాడ నగరం నుంచి పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచినట్టు, 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నట్టు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు సినిమాలు తీసుకుంటే బాగుంటుందని.. నిజ జీవితంలో అది సాధ్యం కాదని ద్వారాంపుడి కౌంటర్ యాటక్ చేసారు.
చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కి.. సీట్లు కుదర్లేదని.. ప్యాకేజీ బేరం సరిపోలేదని ఆరోపించారు. అందుకే ఇప్పుడు తనకు సీఎం పదవి కట్టబెట్టాలని అడుక్కుంటున్నారని సెటైర్లు వేసారు. తమ ప్రభుత్వంలో లోపాలు ఉంటే విమర్సించవచ్చు కానీ.. ప్యాకేజీ అనుకూలంగా ఉన్నప్పుడు ఓ మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం సరిగాదన్నారు. అందుకే పవన్ రాజకీయంగా జీరో అని విమర్శించారు. కాకినాడలో తనని ఓడిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని… పవన్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు, అతని శిష్యుడు పవన్ అని ఆయన అన్నారు. తన వద్ద 15వేల కోట్లు ఉంటే చంద్రబాబు కంటే ముందే పవన్‌ను కొనేసేవాడినని ద్వారంపూడి పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు.